వైసిపి నేత, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ విశాఖపట్నం మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఆదివారం అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, చెట్టి వినయ్ దంపతులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి ధైర్యం చెప్పారు.