పెదబయలు మండలం పంగానం గ్రామనికి చెందిన చిక్కుడు మత్య రాజు కుమార్తె చిక్కుడు అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ప్రతిభ కనబరించింది. ముంచంగి పుట్టు మండలం కిలాగాడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో స్కూల్ అండ్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న అనూష 470/412 మార్కులు సాధించి జిల్లా కేజీబీవీలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపల్ యూఎస్ ప్రసన్న సోమవారం ఆమెను అభినందించారు.