అరకులోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు సోమవారం మధ్యాహ్నం కురిసిన మోస్తారు నుంచి భారీ వర్షంతో ఉపశమనం లభించింది. అయితే కురిసిన వర్షానికి వాహనచోదకులు పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కురుస్తున్న వర్షంతో మామిడి జీడి మామిడి పిందేల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుందని పలువురు గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.