అరకులోయ మండలంలోని చొంపికి వెళ్లే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వంతెన నిర్మాణం కొరకు రహదారిపై మట్టిని త్రవ్వి విడిచి పెట్టేయడంతో గురువారం కురిసిన భారీ వర్షానికి మట్టి రోడ్డాంతా బురదమయమై వాహనాచోదకులు పాదాచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని గిరిజనులు తెలిపారు. సంబంధిత అధికారులు ఈ సమస్యపై స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.