అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ పరిధి హెర్మోను ప్రార్ధన మందిరం వీధిలో పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీల్లో చెత్తచెదరాలు మురుగు నీటి కురుకుపోవడంతో దోమలు ఈగలు కీటకాలు పెరిగి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు బుధవారం వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులతోపాటు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.