అరకులోయ మండలంలో ఇంటర్ సెకండ్ ఇయర్ 72. 6%, ఫస్ట్ ఇయర్ 49% విద్యార్ధులు పాస్ అయ్యారు. ప్రభుత్వ కళాశాల, ఏపీఆర్ (బాలికలు), ఏపీఆర్ (బాలురు) కళాశాలల నుండి ఫస్ట్ ఇయర్ 633 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 49%తో 313 మంది పాసయ్యారు. సెకండ్ ఇంటర్ పరీక్షలకు 625 మంది హాజరవగా 72. 6%తో 454 మంది పాస్ అయినట్లు ప్రిన్సిపాల్స్ లక్ష్మణరావు, విజయలక్ష్మి, పార్వతి తెలిపారు.