అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం గన్నెల పంచాయితీ పరిధిలో గల డప్పుగూడ గ్రామంలో సోమవారం ఉదయం దారుణ హత్య జరిగింది. గదబంటు భీమన్న అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కంటిలో కారం కొట్టి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్య ఎందుకు చేశారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భీమన్నకి నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా నిందితులు లొంగిపోయినట్టు సమాచారం.