అరకు: వర్షంతో చల్లబడిన వాతావరణం

57చూసినవారు
అరకు లోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులు పిడుగుల శబ్దంతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. అయితే కురిసిన భారీ వర్షంతో మారుమూల గ్రామాల్లో మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి. రాగులు, సామ కూరగాయల విత్తనాలు నాట్లు వేసేందుకు ఎంతో మేలు చేస్తుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్