సరియాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

70చూసినవారు
సరియాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
అనంతగిరి మండలంలోని పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఇక్కడ స్నానానికి దిగిన విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం అరకు సీఐ హిమగిరి, తహసీల్దార్‌ మాణిక్యం, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక యువకులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు.

సంబంధిత పోస్ట్