వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు

85చూసినవారు
వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు
పెదబయలు మండలంలోని పలు గ్రామాల్లో వంతెన లేక గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని గుల్లెలు పంచాయతీ పరిధి కించూరు గ్రామానికి వెళ్లే రహదారిపై బుధవారం సాయంత్రం వాగు పొంగి వరద నీరు ప్రవహించడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి కించూరుకి వెళ్లే ఈ రహదారిపై వంతెన నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరారు.

సంబంధిత పోస్ట్