అల్లూరి జిల్లాలో ఏటా చైత్రమాసంలో గిరిజనులు సాంప్రదాయంగా నిర్వహించే ఇటుకల పండుగ సందడి ప్రస్తుతం డుంబ్రిగుడ మండలంలోని కొర్రలో గిరిజనులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామస్తులంతా కలిసి గిరిజన సంప్రదాయమైన థింసా నృత్యం చేస్తూ సందడి చేస్తున్నారు. మహిళలు రహదారికి అడ్డంగా తాడు పెట్టి (పాజోరు)చందాలు అడుగుతారు. పురుషులు వేటకు వెళ్లి వేటాడి జంతువును తెస్తే సాయంత్రం అందరూ కలిసి సహాపక్తి భోజనాలు చేస్తారు.