అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని పెదపాడులో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొర్ర. మాలతిరావు అనే గిరిజనుడి పశువుల శాలపై పిడుగు పడడంతో నాలుగు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో రైతు మాలతిరావు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వమే తనను నష్టపరిహారం ఇప్పించే ఆదుకోవాలని కోరారు.