1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదివాసి హక్కుల పరిరక్షణ కమిటీ కార్యదర్శి చిరంజీవి అధ్యక్షులు గణపతి శనివారం డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలంలోని కొర్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11, 12తేదీల్లో రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ జరుగుతుందన్నారు. ఈ బంద్కు ఆదివాసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.