డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ పరిధి కుసుమగుడ ఎంపీయూపీ పాఠశాలను టీడీపీ అరకు నియోజకవర్గ ఇంచార్జ్ విజయనగరం రీజినల్ చైర్మన్ సివేరి. దొన్నుదొర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల సమస్యలు ఉపాధ్యాయుల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుందని అలాగే ప్రహరీగోడ మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.