డుంబ్రిగుడ మండలంలోని కితలంగి పంచాయతీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని పాడేరు ఐటీడీఏలో శుక్రవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశామని సర్పంచ్ సుబ్బారావు తెలిపారు. పడాలపుట్టు కినంగుడ రంగ్సింగిగుడ పూలుగుడ గ్రామాల్లో పాఠశాల భవనాలు, సీసీరోడ్లు, దేవాలయాలు మంజూరు చేయాలని వినతిలో కోరామన్నారు. దీనికి కలెక్టర్ స్పందించారని తెలిపారు.