డుంబ్రిగుడ మండలంలోని మోర్రిగుడలో తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు మంగళవారం నిరసన చేపట్టారు. సీపీఎం మండల నాయకుడు సురేష్ మాట్లాడుతూ, గొందివలస నుంచి మోర్రిగుడ వరకు గత ప్రభుత్వ హయాంలో తారురోడ్డు నిర్మాణానికి రూ. 57 లక్షల నిధులు మంజూరయ్యాయని, గుత్తేదారు రోడ్డు నిర్మాణం చేపట్టి బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా విడిచిపెట్టేశారని, ప్రభుత్వం స్పందించాలని కోరారు.