రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీడప్ ఉన్నతి ప్రోగ్రాం ద్వారా అనంతగిరి మండల కేంద్రంలో గల ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బుధవారం 11 గంటల నుండి ఉన్నతి జాబ్ మేళా ద్వారా వివిధ ప్రముఖ కంపెనీ లలో నిరుద్యోగ యువతీ యువకులకు వారి అర్హత, ఆసక్తి బట్టి ఎంపిక చేసి శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను కల్పిస్తారని ఎంపీడీవో ఏవివి కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధి అవకాశాలను పొందాలని పేర్కొన్నారు.