అల్లూరి జిల్లా గొండెలి పంచాయితీ, చిడిమెట్ట గ్రామంలో ఆదివాసిమిత్ర సంస్థ ఆధ్వర్యంలో విశాఖజిల్ల నవనిర్మాణసమితి సహకారంతో త్రాగునీటి ట్యాంకు మరియు కొళాయి ఏర్పాటు చేసి ఆ గ్రామానికి మంచి నీరు అందించడం జరిగింది. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ. గిరిజన ప్రాంతంలో మంచినీటి సమస్య ఉన్న గ్రామాలకు నీటిని అందించటమే ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ సమితి ప్రతినిధి డి. రవికుమార్,గ్రామస్తులు పాల్గొన్నారు.