జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ పరిధి అనర్బకొత్తవీధి గ్రామంలో బుధవారం నూతన బోర్వెల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు చిట్టిబాబు, రాంబాబు, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి పాల్గొని కొబ్బరికాయ కొట్టిన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అనర్బకొత్తవీధిలో నూతన బోర్వెల్ నిర్మాణంతో గిరిజనుల తాగునీటి కష్టాలు తీరనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ గిరిజనులు ఉన్నారు.