హుకుంపేట మండలంలోని కోట్నాపల్లి పంచాయతీ పరిధి లోపొలం నుంచి సాలెపుగొంది వరకు 15వ మండల ప్రజా పరిషత్ నిధులతో 5 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వైసిపి మండల అధ్యక్షుడు అనిల్ సర్పంచ్ బొంజుబాబు ఎంపీటీసీ బాలకృష్ణ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుని వారు కోరారు.