హుకుంపేట మండలంలోని ధనరంగాని జంక్షన్ నుంచి బూర్జ గ్రామానికి వెళ్లే తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా తారు రోడ్డుపై గుంతలు ఏర్పడి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు గుంతల్లో వర్షపు నీరు చేరి వాహనదారులు వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం తెలిపారు. అధికారులు స్పందించి ఈ తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.