హుకుంపేట: పాటిమామిడిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

66చూసినవారు
హుకుంపేట: పాటిమామిడిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
హుకుంపేట మండలంలోని ముల్యాపుట్ పంచాయతీ పరిధి పాటిమామిడి గ్రామంలో ఆశా కార్యకర్త పుష్పవతి ఆధ్వర్యంలో గిరిజనులు శుక్రవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లోని మురుగు నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఆశా కార్యకర్త పుష్పవతి మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్