
ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం
ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన కొన్ని పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. జూన్ 11న తన సోషల్ మీడియా వేదిక Xలో "కొన్ని పోస్టులు హద్దులు దాటాయి" అని స్వయంగా అంగీకరించారు. గత వారం మస్క్, ట్రంప్ మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదం జరగ్గా.. మస్క్ ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకున్న తర్వాత రిపబ్లికన్ పార్టీ పన్ను బిల్లుపై విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది.