పెదబయలు: 200 రోజుల పని దినాలు కల్పించాలి

83చూసినవారు
పెదబయలు: 200 రోజుల పని దినాలు కల్పించాలి
పెదబయలు మండలంలోని గుల్లెలు పంచాయతీ పరిధి చిన్నగుల్లేలు సంగంవలస పెదవచరంగి తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న ఈ పనులకు ఆయా గ్రామాల ఉపాధి హామీ కూలీలు పాల్గొని ఉపాధిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని లక్ష్యంతో ఈ పథకం చేపట్టింది. అయితే 200 రోజుల పని దినాలు కల్పించాలని పలువురు కూలీలు శనివారం కోరారు.

సంబంధిత పోస్ట్