పెదబయలు మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధి పాతపాడుకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు ఉన్న మట్టిరోడ్డు కొట్టుకుపోయిందన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కనీసం గుర్రాలపై కూడా రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఆదివారం వాపోయారు. అధికారులు ప్రభుత్వం స్పందించి పాతపాడుకి రహదారి నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.