పెదబయలు: రాబిస్ లక్షణాలతో విద్యార్థి మృతి

51చూసినవారు
పెదబయలు: రాబిస్ లక్షణాలతో విద్యార్థి మృతి
పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. మండలంలోని గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి చదువుతున్న విద్యార్థి మఠం ఆదిత్య రామచంద్ర పడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్క కాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్