పెదబయలు మండలంలోని సీకరి పంచాయతీ పరిధి పన్నేడా జంక్షన్ వద్ద 398 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ రమణ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. శుక్రవారం తమ సిబ్బందితో కలిసి పన్నేడా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా జీపును ఆపి తనిఖీ చేయగా అందులో 398 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. దీని విలువ సుమారు రూ. 19, 90 వేలు ఉంటుందన్నారు. పైలాట్ గా ఉన్న బైక్ తోపాటు జీపును స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసామన్నారు.