ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా జరగనుంది. ఇందులో 10 కంపెనీలు 800 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డి.ఎస్.డి.ఓ. డా. రోహిణి సూచించారు. ఆసక్తి గల వారు https://www.naipunyam.ap.gov.in/user-registrationలో నమోదు చేసుకోవాలని తెలిపారు.