పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీ పరిసర ప్రాంతంలో శనివారం సాయంత్ర సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో బూసిపుట్ సేమగెడ్డకు మధ్య రహదారికి అడ్డంగా భారీ మామిడి చెట్టు కూలింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాలని కోరుతున్నారు.