ముంచంగిపుట్టు మండలంలోని వనంబసింగి పంచాయతీ పరిధి లుంగాపుట్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భారీ వృక్షాన్ని తొలగించారు. చిన్నపాటి ఈదురుగాలులు వీచినా రహదారిపై రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు నేలకొరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్అండ్బి అధికారులు ముందస్తు చర్యలో భాగంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భారీ వృక్షాన్ని తొలగించడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.