ముంచంగిపుట్టు మండలంలోని రంగాబయలు పంచాయతీ పరిధి బుడ్డపనసలో వైస్. ఎంపీపీ భాగ్యవతి ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు పిహెచ్సి సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కొద్ది రోజులుగా చర్మవ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. వైఎస్ ఎంపీపీ భాగ్యవతి మాట్లాడుతూ. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని కోరారు.