ముంచంగిపుట్టు మండలంలోని మాకవరంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో మాకవరం గ్రామ గిరిజనులకు చెందిన ఏడు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులెవరో నిప్పు పెట్టడంతో వరికుప్పలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రైతులు పరుశురాం రాంబాబు, నర్సింగ్ పడాల్ రఘుపతిపడాల్, రాధాకృష్ణ, తిరుపతి, పరశురాం, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తమను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.