ముంచంగిపుట్టు మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పద్మారావు నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి నిరుపేదలను ఆదుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.