ముంచంగిపుట్టు: కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్ పర్సన్ పరామర్శ

59చూసినవారు
ముంచంగిపుట్టు: కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్ పర్సన్ పరామర్శ
ముంచంగిపుట్టు మండలం కుముడా పంచాయతీ బూరుగుమెట్ట గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొరగం సోమన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైసీపీ మండల టీంతో కలిసి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చుస్తూ తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా సుభద్ర సోమన్న కుటుంబ సభ్యులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్