అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి.గోందురు పంచాయతీకి చెందిన సూకురుపుట్టు గ్రామంలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ మార్పుల ప్రభావంపై శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సొసైటీ చీఫ్ ఆఫీసర్ కె.మన్మదరావు హాజరయ్యారు. కార్యక్రమంలో పెసా ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ కూండిపు పంతులుబాబు, వార్డు మెంబర్ వి.భానుమతి, ఆదివాసీ మిత్ర సిబ్బంది పాల్గొన్నారు.