అన్ని గ్రామాల్లో నాడెప్ పిట్టులను ఏర్పాటు చేయాలని ఎగువశోభ సెక్రటరీకి ఎంపీడీఓ కుమార్ సూచించారు. గ్రామాలలో సేకరించిన చెత్తను నాడెప్ పిట్టులలో వేయించాలని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ శుక్రవారం ఎగువశోభ పంచాయితీ కేంద్రంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తడి, పొడి చెత్తల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎగువశోభ గ్రామంలో చెత్త సేకరణ విధానం గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.