విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజరు రైళ్లు అరకు వరకే నడుస్తాయని అరకు రైల్వే అధికారులు తెలిపారు. కేకే లైన్ లోని పాడువ - దార్లిపుట్ మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్నాని అన్నారు. దీంతో విశాఖ-కిరండూల్ పాసింజరు(58501) రైలు ఏఫ్రిల్ 14 నుండి 22 వరకు విశాఖ నుండి అరకు వరకే నడుస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ పాసింజరు(58502) రైలు ఈ నెల 14 నుండి 22వరకు అరకు నుండి విశాఖ బయలుదేరుతుందని పేర్కొన్నారు.