డుంబ్రిగుడలో యోగా శిక్షణ కార్యక్రమం

66చూసినవారు
డుంబ్రిగుడలో యోగా శిక్షణ కార్యక్రమం
యోగ తోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసమని డుంబ్రిగుడ ఎంపీడీవో ప్రేమ్ సాగర్ అన్నారు. స్థానిక పంచాయితీ సెక్రటరీ గౌతమి ఆధ్వర్యంలో డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ఆసనాలు వేయించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. యోగ మనిషికి ప్రశాంతత కలిగిస్తుందని చెప్పారు. డిప్యూటీ తహసిల్దార్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్