భీమునిపట్నం మండలం అడవివరంలో పైడితల్లి అమ్మవారి పండుగ మంగళవారం వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమలు అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. సింహాచలం ఈవో త్రినాథరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.