మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ఎస్జీటీలను హెచ్ఎంలుగా నియమించాలని యుటిఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్కూల్స్ ని 9 రకాల పాఠశాలలుగా విభజించడం వల్ల తల్లిదండ్రులు విద్యార్థులు గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తొమ్మిది రకాల పాఠశాలలకు తెలుగు పేర్లు పెట్టకపోవడం శోచనీయం అన్నారు.