భీమిలి: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

53చూసినవారు
భీమిలి: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
భీమిలి పరిధిలోని తగరపువలస సమీపంలోని సంఘవలస వద్ద శనివారం మధ్యాహ్నం భవనంపై నుంచి పడి వెంకట్రావు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు వివరించారు. మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్