మధురవాడలో చైన్ స్నాచర్ అరెస్టు

7చూసినవారు
మధురవాడలో చైన్ స్నాచర్ అరెస్టు
ఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 2వ తేదీ సాయంత్రం వైఎస్సార్ కాలనీ బ్లాక్ నెం:25లో నివసించే కొత్తకోట వరలక్ష్మి (65) మెడలోని గొలుసు గుర్తు తెలియని వ్యక్తి అపహరించగా, ఆమె క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై క్రైమ్ సీఐ బిఎస్ఎస్ ప్రకాష్, ఎస్‌ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ బాబా అమర్ శేఖర్ బృందం విచారణ చేపట్టి, కాపుల ఉప్పాడకు చెందిన గూడేల ఆదినారాయణ (25)ను అరెస్ట్ చేసి, గొలుసు స్వాధీనం చేసి రిమాండ్‌కు తరలించారు.