ఆనందపురం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

0చూసినవారు
ఆనందపురం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఉల్లిపాయలు లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఉల్లిపాయల లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్