విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోని అయినాడ, కోరాడ గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో కేంద్రబృందం సోమవారం పర్యటించింది. కేంద్ర పథకాల అమలు తీరుపై పరిశీలించింది. అనిల్ గైక్వాడ్, అనిల్ నింబోల్కర్లతో కూడిన బృందం ఆయా పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పధకం పనులు, గ్రామ పంచాయతీ, , రైతు భరోసా కేంద్రాలు, హర్టీకల్చర్, హౌసింగ్, స్వయం సహాయక సంఘాల నిర్వహణ, భూరికార్డుల పరిశీలన వంటి పలు అంశాలను పరిశీలించారు.