ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అందులో భాగంగా శుక్రవారం మండల తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో అర్జీలు రైతుల నుండి స్వీకరించారు.