విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన బాలుడి మృతదేహం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ దుర్గ బీచ్ లో గురువారం లభ్యమైంది. స్థానికులు మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.