
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబ శివారెడ్డి
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరి సాంబశివారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే వరకు తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను ఆలూరి పర్యవేక్షించనున్నారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు వైసీపీ స్పష్టం చేసింది.