పర్యావరణ హితంగా రంగుల హోళీ నిర్వహిద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ విశాలాక్షి పిలుపునిచ్చారు. బుధవారం విశాఖపట్నంలోని ఆస్క్ ఫౌండేషన్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన, బారలోహాలతో కూడిన రంగులు వినియోగించవద్దన్నారు. ప్రకృతి ఆధారిత రంగులతో హోళీ నిర్వహిద్దాం అన్నారు.