భీమిలిలోని ఎండాడలోని సెయింట్ లూక్స్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 205వ జయంతి సందర్భంగా విజయా లూక్, సెయింట్ లూక్స్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఎండాడలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో డాక్టర్లు, ప్రొఫెసర్లు నర్సింగ్ సేవలను కొనియాడారు. విజయా లూక్ కరస్పాండెంట్ డాక్టర్ మమతా ప్రసాద్ నర్సింగ్ రంగానికి వెన్నెముక వంటిదన్నారు.