వడ్డాది జనసేన వీర మహిళగా బేర పార్వతి

84చూసినవారు
వడ్డాది జనసేన వీర మహిళగా బేర పార్వతి
బుచ్చయ్యపేట మండలం వడ్డాది జనసేన కార్యాలయంలో అధ్యక్షులు దొండ సాయి అధ్యక్షతన గురువారం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో వడ్డాది జనసేన వీర మహిళగా 10వ వార్డ్ మెంబెర్ బేర పార్వతిని నియమించారు. పార్వతి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇంచార్జి పీవీసన్ రాజు కి, జిల్లా కార్యదర్శి రామమూర్తి, మండలం ప్రెసిడెంట్ డిఎస్ నాయుడు, యూత్ ప్రెసిడెంట్ షేక్ రసూల్, అధ్యక్షులు దొండ సాయి కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్